నమస్కారం!
చదరంగం భారతదేశంలో పుట్టిన ఒక అద్భుతమైన మేధోక్రీడ. దీనికి వయసుతో సంబంధం లేదు. దూరాభారాలతో పని లేదు. ఆడా మగా అన్న భేదం లేదు. ఇరవయ్యేళ్ళ కుర్రాడు అరవయ్యేళ్ళ తాతగారిని ఛాలెంజ్ చెయ్యవచ్చు. ఖండాంతరాలలో వున్నవారు కూడా ఇంటర్నెట్ లో లేక కనీసం ఉత్తరాలలోనైనా ఆడుకోవచ్చు. మహిళలు సైతం పురుషులతో సమరానికి సై అనవచ్చు, మట్టి కరిపించనూవచ్చు. ఈ అద్భుతమైన ఆటకి సంబంధించిన నియమాలు, ఎత్తులు, పై ఎత్తులు, అటాకింగ్ వ్యూహాలు, డిఫెన్సివ్ పద్ధతులు, ఓపెనింగులు, మిడిల్ గేమ్ మరియు ఎండ్ గేమ్ స్ట్రాటజీలు వగైరా వగైరాలు నాకు తెలిసినంత వరకూ ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.